హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్చర్లలో డిసెంబర్ 1న ద్విచక్ర వాహనాల వేలం

MBNR: జడ్చర్ల ఆబ్కారీ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలకు డిసెంబర్ 1న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.5 వేల ధరావతు చెల్లించాలని సూచించారు. వాహనం దక్కించుకున్న వారు అదే రోజు వేలం ధరతో పాటు 18 శాతం జీఎస్టీని చలాన రూపంలో చెల్లించాలన్నారు. ఆసక్తిగల వారు నిర్ణీత సమయానికి హాజరుకావాలని కోరారు.