JGL: గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సర్పంచ్ నీరటి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని 4, 5 వార్డుల రెండో బైపాస్ రోడ్డులో పంచాయతీ నిధులతో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు, నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేస్తామన్నారు. ఉపసర్పంచ్ సాయిరెడ్డి, ఆత్మ చైర్మన్, వార్డు మెంబర్ పాల్గొన్నారు.
తెలంగాణ
మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం


