హైదరాబాద్: 28°C
తెలంగాణ

13 రోజులుగా మూతపడిన మిర్యాలగూడ ఈఎస్ఐ డిస్పెన్సరీ

NLG: మిర్యాలగూడలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ 13 రోజులుగా మూతపడి ఉంది. రెండున్నర ఏళ్ల అద్దె బకాయిలు పేరుకుపోవడంతో భవన యజమాని తాళం వేశారు. ఏడాది బకాయి చెల్లించి, మిగిలిన 18 నెలల అద్దెను 15 రోజుల్లో చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినా రెండు నెలలుగా అమలు కాలేదు. ప్రభుత్వ భవనంలోకి డిస్పెన్సరీని మార్చాలన్న జీవో ఉన్నా చర్యలు లేవు. మందుల కోసం వస్తున్న రోగులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.