SRPT: ఈ నెల 29న కోదాడలో దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, ఆయన త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కోదాడ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కోదాడలో ఎల్లుండి బీఆర్ఎస్ దీక్షా దివస్


