నిర్మల్ ఖానాపూర్ మండలం సత్తనపల్లి పంచాయతీ పరిధి రాంరెడ్డిపల్లెలో ఇటీవల మురుగునీటి కాలువ నిర్మించారు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న మిషన్ భగీరథ పైపు లైన్లను తొలగించారు. పని పూర్తయ్యాక వాటిని పునరుద్ధరించలేదు. పైపు కత్తిరించిన చోటు నుంచి తాగు నీరు వృథాగా పోతోంది. దీంతో గ్రామస్థులకు, స్థానిక అంగన్వాడీ కేంద్రానికి నీటి కొరత ఏర్పడింది.
తెలంగాణ
వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు


