హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటి పన్ను చెల్లిస్తేనే ఇందిరమ్మ బీమా?

MHBD: కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లిస్తేనే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తామని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే షరతులు విధిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అర్హులందరికీ పథకం అందేలా చూడాలని కోరుతున్నారు.