హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో సీపీఐ పోటు ప్రసాద్ వర్ధంతి సభ

KMM: సీపీఐ మాజీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ద్వితీయ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. సభలో సీపీఐ జాతీయ నాయకుడు హేమంతరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో పీజీ కళాశాల నిర్మాణం కోసం పోటు ప్రసాద్ ప్రభుత్వంతో నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.