రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షంతో చేతికొచ్చిన పంటలు తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాలు, వెంచర్లలో ఆరబెట్టిన వడ్లు, ఏరిపోసిన పత్తి తడవడంతో నాణ్యత, గిట్టుబాటు ధర తగ్గే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
తడిసిన వడ్లు, పత్తి.. రైతులకు తీరని నష్టం!


