KMR: మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలోఇవాళ ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సర్పంచ్ మహేష్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంగ్రామ్ పటేల్, పంచాయతీ కార్యదర్శి వెంకటరామిరెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెద్ద ఎక్లారాలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం


