SRD: సిర్గాపూర్ మండలం వాసర్ లచ్చుతాండ నుంచి గౌడ్గం చౌరస్తా వరకు 6 కిలో మీటర్ల మేర సింగల్ బీటీ రోడ్డు పూర్తిగా గతుకులమయం కాగా ప్రయాణం నరకప్రాయంగా మారింది. రోడ్డు పలుచోట్ల కోతకు గురై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు సత్వరమే మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
లచ్చుతాండ–గౌడ్గం రోడ్డును పట్టించుకోని అధికారులు


