హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికకు రూ. 2.50 లక్షల ఎల్వోసీ మంజూరు

NZB: రుద్రూర్ మండలం రాణంపల్లికి చెందిన సాత్వికకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆపన్నహస్తం అందించారు. తల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెకు శస్త్రచికిత్సకు భారీగా ఖర్చవుతుండగా..CMRF నుంచి రూ.2.50 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు. ఆ నిధులతో వైద్యులు బాలికకు విజయవంతంగా న్యూరో సర్జరీ నిర్వహించడంతో సాత్విక తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.