హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రిడ్జి నిర్మాణం లేక ప్రజల అవస్థలు

SRD: సిర్గాపూర్ మండలం చీమలపాడు నుంచి నాగన్‌పల్లి మీదుగా కంగ్జికి వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మించాలని TG BC సంఘం, గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే 20-30 గ్రామాల ప్రజలకు ప్రయాణ దూరం తగ్గి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అధికారులు కలెక్టర్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలి.