NLG: డిండి మండలంలో వర్షాభావంతో సుమారు 6 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. డిండి ప్రాజెక్టు కింద వరి, పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రాజెక్టు నీరు వృథా కావడం,కాల్వకు నీరు ఆలస్యంగా రావడంతో పంటలకు సాగునీరు అందలేదు. అధికారులు సమగ్ర సర్వే చేసి అర్హులైన రైతులకు పరిహారం అందించాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.
తెలంగాణ
డిండిలో 6 వేల ఎకరాల్లో ఎండిన పంటలు


