SRD: మునిపల్లి మండలం బుదేరా X రోడ్ వద్ద NH65పై ఉన్న ఫ్లైఓవర్ సమీపంలో వర్షపు నీరు చేరి సర్వీస్ రోడ్డు పూర్తిగా జలమయమైంది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రయాణికులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వర్షం కురిసినప్పుడు ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంటోంది. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు
తెలంగాణ
జలమయమైన 65వ జాతీయ రహదారి


