ADB: ఓటరు కార్డులో సవరణలకు ఒకే ప్రక్రియలో పదేపదే దరఖాస్తులు చేయరాదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. కైలాష్నగర్కు చెందిన శేఖర్ ఇంటిపేరు, తండ్రి పేరు మార్పు కోసం వేర్వేరుగా ఫారం-8 దరఖాస్తు చేయగా రెండో దరఖాస్తు తిరస్కరణకు గురైందన్నారు. తుది ఓటరు జాబితా ప్రచురణ తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈఆర్వోను శుక్రవారం ఆదేశించారు.
తెలంగాణ
ఓటరు కార్డు మార్పులకు ఒకేసారి దరఖాస్తు


