హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెరిగిన పప్పుల ధరలు.. సామాన్యులకు భారం

NLG: నల్గొండ జిల్లాలో పప్పు ధాన్యాల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. నెల రోజుల్లోనే కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. కంది పప్పు రూ.180, పెసరపప్పు రూ.140, మినపప్పు రూ.140, శనగపప్పు రూ.100కు చేరాయి. మరో వారంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.