హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల పర్యవేక్షణ కరువు..వృథా అవుతున్న విద్యుత్

KNR: కేశవపట్నం గ్రామ వీధుల్లో పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతుండటంతో విద్యుత్ వృథా అవుతోంది. విద్యుత్ పొదుపుపై ప్రభుత్వం సూచనలు చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి సాంకేతిక సమస్యలను పరిష్కరించి, విద్యుత్ వృథాను అరికట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.