జనగామ జిల్లాలో 6వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 28న నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. రేపు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 656 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు 11 గంటలలోపు పరీక్ష కేంద్రాల్లో ఉండాలన్నారు.
తెలంగాణ
నవోదయ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


