SRD : గుమ్మడిదలలో గంజాయి మొక్కలు పెంచుతున్న నేపాల్‌కు చెందిన నలుగురిని గుమ్మడిదల పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడిదల పట్టణంలోని ఓ రైస్ మిల్లు ఆవరణలో సంతోష్ సాధు, దన్‌మన్ సాధు, శ్యాంసుందర్ సాధు, కమలేష్ సాధు గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
గంజాయి మొక్కలు పెంచుతున్న నలుగురు అరెస్ట్


