ADB: యువతలో క్రీడా స్ఫూర్తి, విజ్ఞానాన్ని పెంచేందుకు నిర్వహిస్తున్న ‘ఖేలో తెలంగాణ గ్లోబల్ క్విజ్’లో విద్యార్థులు, ప్రజలంతా పాల్గొనాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. 8వ ఖేలో ఇండియా క్రీడల నేపథ్యంలో తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో నిర్వహిస్తున్న ఈ ఆన్లైన్ క్విజ్ కోసం kheloquiz.telangana.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఖేలో తెలంగాణ గ్లోబల్ క్విజ్‌లో పాల్గొనండి: కలెక్టర్


