హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్డెన్ సెర్చ్‌పై పోలీసుల అవగాహన

నిర్మల్ భైంసా మండలం పెండపల్లి గ్రామంలో SP జానకి షర్మిల ఆదేశాల మేరకు ASP సాయికిరణ్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. 70 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోల పత్రాలు తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. సైబర్ నేరాలు, రహదారి భద్రత, గంజాయి నివారణ, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. రూరల్ CI ప్రవీణ్, SI సుప్రియ పాల్గొన్నారు.