హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చలికాలంలో నీళ్లు తక్కువ తాగుతున్నారా?

చలికాలంలో దాహం తక్కువగా వేయడంతో చాలామంది నీరు తాగడం తగ్గిస్తారు. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. శరీరంలో నీరు తగ్గితే మెదడు పనితీరు, ఆలోచనా సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రం చిక్కబడుతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరగడమే కాకుండా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. చలికాలంలోనూ నీరు తాగడం నిర్లక్ష్యం చేయొద్దు.