హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భోజనం వేగంగా తినేస్తున్నారా..?

ఆహారాన్ని సరిగ్గా నమలకుండా వేగంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. వేగంగా తినేవారు అవసరానికి మించి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందకుండా వృధా అవుతాయి. కాబట్టి ప్రతి ముద్దను బాగా నమిలి నెమ్మదిగా తినడం మంచిది.