కడప జిల్లా బి.కోడూరు మండలం పెద్దల్లపల్లి గ్రామపంచాయతీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు పూర్తికాగా, వైసీపీ మద్దతుదారురాలు ఎస్. లక్ష్మీదేవి 11 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం ఎన్నికల సామగ్రితో బ్యాలెట్ బాక్సులను బస్సులో తరలించేందుకు ప్రయత్నించగా.. టీడీపీ మద్దతుదారులు అడ్డుకున్నారు. రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఆంధ్రప్రదేశ్
11 ఓట్లతో గెలుపు.. రీ కౌంటింగ్‌కు డిమాండ్


