హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

65 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌గా విజయం

KDP: బద్వేల్ మండలం కొంగలవీడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గొడుగునూరు సుశీలమ్మ 53 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజయం సాధించిన సుశీలమ్మ (65)కు గ్రామస్థులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు వైసీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.