హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్దికేరలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

KRNL: మద్దికేరలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మల్లికార్జున యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల మద్దతు కూడగట్టాలని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు.