హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ ఢీకొని వ్యక్తి కి తీవ్రగాయాలు..!

NTR: తెల్లదేవరపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన 41 ఏళ్ల కనకపూడి అశోక్ బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు విస్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం విజయవాడకు పంపాలని వైద్యులు సూచించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.