హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీకేవీధి మండలంలో చింతపల్లి ఏఎస్పీ పర్యటన

ASR: గూడెం కొత్తవీధి మండలంలో గురువారం చింతపల్లి ఏఎస్పీ జాదవరావు నిరంజన్ మహేంద్ర సిన్హా పర్యటించారు. స్థానిక సీఐ బీ.సుధాకర్ తో కలిసి సంకాడ గ్రామంలో పర్యటించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. మండలంలో కౌంటింగ్ సమయంలోనూ, కౌంటింగ్ అనంతరం ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.