హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాచనపల్లిలో పోలీసుల లాఠీ ఛార్జ్

అనంతపురం రూరల్ పరిధిలోని రాచనపల్లిలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి ఓ వర్గం వారిని అనుమతించి, తమను అనుమతించలేదని మరో వర్గం వారు ఆరోపించారు. వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో గందరగోళం నెలకొంది. దీంతో పోలీసలు లాఠీ ఛార్జ్ చేసి, ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌కు కాస్త అంతరాయం ఏర్పడిందని సమాచారం.