హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుధ్య కార్మికులతో ఛైర్‌పర్సన్ భేటీ

PLD: చిలకలూరిపేటలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడాలని, ఈ విషయంలో రాజీపడేది లేదని మున్సిపల్ చైర్‌పర్సన్ తోట రాజ రాజేశ్వరి స్పష్టం చేశారు. గురువారం 1వ డివిజన్‌లో కార్మికుల హాజరును పరిశీలించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే కార్మికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తోట రాజా రమేష్ పాల్గొన్నారు.