హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ తీరంలో మత్స్యకారుడు గల్లంతు

విశాఖ తీరంలో పడవ బోల్తా పడింది. యాంకరేజ్‌లో ఉన్న షిప్పును పడవ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలయ్య అనే మత్స్యకారుడు గల్లంతు అవగా.. వేరే బోటు సాయంతో అతడి కుమారుడు ముత్తురాజు ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో గల్లంతైన పోలయ్య కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.