హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీ సేవ కేంద్రంలో అధిక వసూళ్ల ఆరోపణలు

NLR: సూళ్లూరుపేట రైల్వే గేటు సమీపంలోని మీ సేవ కేంద్రంలో ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం నిర్ణీత ఫీజు రూ.150కు బదులుగా రూ.350 వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్న రూ.200కు రసీదు ఇవ్వడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.