హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం.. ఎవరు గెలిచారంటే?

నెల్లూరు జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఒంటి గంటకు ముగిసింది. తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. కొండాపురం మండలం అల్లప్పగుంట పంచాయతీ సర్పంచిగా TDP మద్దతుదారు కిలారి శశికళ విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి మునికాంతపై 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.