హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నగొన్నూరులో జనసేన అభ్యర్థి విజయం

కృష్ణా: జిల్లాలో జరుగుతున్న తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామపంచాయతీలో జనసేన బలపరిచిన అభ్యర్థి కోటప్రోలు భార్గవ్ విజయం సాధించారు. ప్రత్యర్థిపై 22 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించడంతో జనసేన శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.