VZM: నక్కపల్లి మండలం కాగితలో మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విశాఖకు చెందిన నలుగురు యువకులను బుధవారం ఉపమాక రోడ్డు కూడలి వద్ద అరెస్టు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు సీఐ మురళి తెలిపారు. జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఆంధ్రప్రదేశ్
'కింతలివానిపేటలో టీడీపీ విజయం'


