GNTR: కొల్లిపర మండలంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గురువారం పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి కోతలు, నూర్పిడి, ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటుపై వివరాలు తెలుసుకున్నారు. రైతులకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా అందాలని, తేమశాతం తగ్గించేలా ధాన్యం ఆరబెట్టే విధానంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా చూడాలన్నారు
ఆంధ్రప్రదేశ్
కొల్లిపరలో పంటలను పరిశీలించిన జేసీ


