హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీలకతీతంగా విద్యార్ధులకు రూ. 5వేలు'

GNTR: పెదనందిపాడు మండలం వరగాని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కురేటి భూషయ్య కుమారుడు ఇచ్చిన హామీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. భూషయ్య కుమారుడు మాట్లాడుతూ.. మా నాన్నను గెలిపిస్తే గ్రామంలో పార్టీలకతీతంగా LKG -10వ తరగతి చదివే విద్యార్ధులకు రూ.5వేలను ప్రతి సంవత్సరం డిసెంబర్-11వ తేదీన మా నాన్న పుట్టిన రోజు సందర్భంగా అందచేస్తామని అన్నారు.