హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్లు లేక బోసిపోయిన పోలింగ్ కేంద్రం

E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని బొమ్మూరు 14వ వార్డులో పోలింగ్ మందకొడిగా సాగింది. పంచాయతీ కార్యాలయం సమీపంలోని పోలింగ్ కేంద్రం సాయంత్రం నాలుగు గంటలకే ఓటర్లు లేక బోసిపోయింది. గ్రామ పంచాయతీ నుంచి నగరపాలక సంస్థలో కొత్తగా విలీనం కావడంతో తమ ఓటు ఏ కేంద్రంలో ఉందో తెలియక పలువురు గందరగోళానికి గురయ్యారు. చాలామందికి ఓటరు స్లిప్పులు అందలేదన్నారు.