TPT: రామచంద్రాపురం మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు ఎంపీడీవో పులిరాంసింగ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈనెల 26న జరిగే ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సిబ్బందికి రేపు పోస్టల్ బ్యాలెట్


