హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడేళ్లుగా మూలన పడ్డ ఫుడ్ సేఫ్టీ వాహనాలు

విశాఖలోని ఆహార భద్రత ప్రయోగశాలను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గురువారం పరిశీలించారు. కేంద్రం మంజూరు చేసిన నాలుగు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలు మూడేళ్లుగా వినియోగంలోకి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, సిబ్బందిని నియమించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.