హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం... ఇద్దరికి గాయాలు

KKD: సామర్లకోట మండలంలోని మేడపాడు సమీపంలో రోడ్డుపై ఉన్న గోతులో పడి ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు. బిక్కవోలు నుంచి సామర్లకోట వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు బాలుడికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్లపై గోతులను వెంటనే పూడ్చి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.