హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్ ఎక్సైజ్ స్టేషన్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

NDL: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు, విధుల ప్రాధాన్యతను సిబ్బంది గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జఫ్రుల్లా, హెడ్ కానిస్టేబుళ్లు కె.నాగరాజు, వెంకట రమణ, కానిస్టేబుల్ ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.