హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ బాధ్యతలు నిర్వర్తించాలి'

MLG: భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు పిలుపునిచ్చారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ములుగు కలెక్టరేట్‌లో అధికారులు, ఉద్యోగులతో కలిసి రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ఆచరణలో పాటించాలని సూచించారు.