హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవాలి: ఎమ్మెల్యే

JGL: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మల్లాపూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి గురువారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సోదరభావం విలువలను కాపాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవాలని పిలుపునిచ్చారు.