హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరుడు కిష్టయ్య త్యాగం చిరస్మరణీయం

కరీంనగర్‌ : తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసిన అమరవీరుడు పోలీస్‌ కిష్టయ్య త్యాగం మరువలేనిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. డిసెంబరు 1న నిర్వహించనున్న కిష్టయ్య 17వ వర్ధంతి పోస్టర్‌ను కరీంనగర్‌లోని తన నివాసంలో ముదిరాజ్‌ సంఘం నాయకులతో కలిసి ఆయన గురువారం ఆవిష్కరించారు. అమరుల కుటుంబాలకు భారాస ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.