హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంవిధాన్ రక్షా మార్చ్‌కు ములుగు కాంగ్రెస్ భారీ తరలింపు

MLG: రాజ్యాంగపరిరక్షణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో టీపీసీసీ నిర్వహించిన సంవిధాన్ రక్షామార్చ్‌కు ములుగు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు పైడాకులఅశోక్ నాయకత్వంలో సుమారు 100 వాహనాలతో బయలుదేరారు. ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని అశోక్ విమర్శించారు.