హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు

MLG: ములుగు బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. డప్పు కళాకారుల దరువులు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. జన్ను రవి, నద్దునూరి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.