హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అప్పగించిన కానిస్టేబుల్

HNK: శాయంపేట మండలం మాంధారిపేట స్టేజి వద్ద చెన్నాపూర్ గ్రామానికి చెందిన ఓన్నాల అంజలి గురువారం ఉదయం మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకోగా గుర్తించిన కానిస్టేబుల్ శివ తిరిగి కుటుంబసభ్యులకు అందచేశారు. మొబైల్ ఫోన్‌లో ఉన్న ఆధార్ కార్డు సహాయంతో బాధితురాలి ఆచూకీ తెలుసుకొని పోలీస్ స్టేషన్ ఆవరణలో తిరిగి అప్పగించ్చాడు. దీంతో కానిస్టేబుల్‌ను సీఐ సుధాకర్ రెడ్డి అభినందించారు.