హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర

BHPL: రేగొండ(M)తిరుమలగిరి శివారులోని బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర నాలుగో రోజు భక్తిశ్రద్ధలతో కొనసాగింది. జాతరలో భాగంగా నేడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ భక్తులు కోళ్లు, మేకలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది.