హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల హక్కులపై అవగాహన ర్యాలీ

KMR: మహిళలు, బాలికలపై హింసను అరికట్టడంతో పాటు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి పాల్గొని మహిళలు అన్యాయానికి, వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా న్యాయ సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశా, ఏఎన్‌ఎం,విద్యార్థులు పాల్గొన్నారు.